ఏపీలో కొత్తగా 20,937 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 3,475 కేసులు
  • చిత్తూరు జిల్లాలోనూ 3 వేలకు పైగా కొత్త కేసులు
  • రాష్ట్రంలో 104 మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న వారు 20,811 మంది
ఏపీలో కరోనా విజృంభణ విశృంఖలంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
COVID19

More Telugu News